మేడారం జాతరకు స్వాగతం

సమ్మక్క సారక్క జాతర, ప్రో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.
వరంగల్లు నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశములోనే అతి పెద్ద గిరిజన జాతర"గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది .
మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను అప్పటి ఆంధ్ర ప్రదేశ్,ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది .

వివరాల జాబితా

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఉదయం పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తారు. పెళ్లి అవని కన్నె పిల్లలు, సంతానం లేని దంపతులు, తీరని వ్యాదులనుండి బాధింపబడు వారు ప్రత్యేక పూజలు జరుపుతారు. కన్నెపల్లి గ్రామస్థులు సారలమ్మ అమ్మవారికి హారతిని ఇచ్చి సాగనంపుతారు. అక్కడినుండి సారలమ్మ మూర్తిలు జంపన్న వాగు మీదుగా గద్దెకి చేరుకుంటాయి. గద్దెపైన సారెలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆచారాలు జరుగుతాయి.

రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క దేవతను పోలీసులు మరియు ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఊరేగింపుగా తీసుకు వస్తారు. "ఎదురుకోళ్ల ఘట్టం" ఈ ప్రక్రియలో ముఖ్యమైనది. జిల్లా పోలీస్ అధికారి గారు తమ తుపాకీతో గాలిలో మూడు సార్లు గౌరవ సూచకంగా కాల్పులు జరిపి బలి ని ప్రారంభిస్తారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య సమ్మక్క గద్దెపైకి చేరుకుంటారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు
మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరించి దర్శించుకుంటారు. మహిళలు అమ్మ వార్లకు ఓడి బియ్యం, సారె లు సమర్పించుకుంటారు. బంగారం (తెల్ల బెల్లం) ముఖ్యమైన నైవేద్యంగా సమర్పించుకుంటారు. మూడవరోజు అత్యంత రద్దీ అయిన రోజు.
నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. కోట్లాది భక్తుల పూజలు అందుకున్న తర్వాత సమ్మక్క సారక్క దేవతలు వన ప్రవేశం చేస్తారు. అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో తిరిగి వనప్రవేశం చేస్తారు.
మార్గదర్శకాలు
  జాతర ప్రారంభం అయ్యే మొదటి వారంలో ఆ మార్గములలో భారీ రవాణా వాహనాలు నిషేధించబడినవి
  పటిష్టమైన నిఘా మరియు ప్రత్యక్ష పర్యవేక్షణకై అవసరమైన చోట సీసీ కెమెరాలు, ఎగిరే కెమెరా లు ఉపయోగించబడతాయి
  వరంగల్ నుండి వచ్చు వాహనాలకు గుడెప్పాడ్, మల్లంపల్లి, ములుగు, పసర నుండి నార్లాపూర్ మార్గము ఒకవైపు మార్గముగా చేయబడింది
  ఏటూరు నాగారం వైపు నుండి వచ్చు, వేళ్ళు చిన్న వాహనాలకు చిన్నబోయినపల్లి, కొండై., మల్యాల మీదుగా ఊరట్టం మార్గం కేటాయించబడింది
  మేడారం నుండి తిరిగివెళ్ళు వాహనాలకు రెండు మార్గాలు కేటాయించ బడినాయి. వరంగల్ వైపునకు నార్లాపూర్, బయ్యక్కపే, గొల్ల బుద్దారం, కమలాపూర్ మీదుగా భూపాలపల్లి, పరకాల నుండి ఒక మార్గం, కాళేశ్వరం వైపు వెళ్లే వాహనాలకు కల్వపల్లి, యమానపల్లి, చింతకాని, కాటారం, మహాదేవపూర్ మరొక మార్గం కేటాయించబడినాయి
  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులకు ప్రత్యేక మార్గం (పసర-తాడ్వాయి-మేడారం) కేటాయించబడింది
  వాహనాల పార్కింగ్ కోసం 30 కి పైగా పార్కింగ్ ప్రదేశాలు 1000 కి పైగా ఎకరాలు గుర్తించడం జరిగింది
  మార్గంలో అవసరమైతే వాహనాలు నిలుపుటకు 20 కి పైగా హోల్డింగ్ ప్రదేశాలను గుర్తించడం జరిగింది
  ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మరియు పోలీస్ అవుట్ పోస్ట్ యాత్రికులకు మార్గదర్శనం చేయడానికి పోలీసులు నియమించబడ్డారు
  ఎక్కడైనా రవాణా అడ్డంకులు ఎదురైతే సత్వరంగా తొలగించడానికి , క్రేన్లు, జేసీబీ లు మరియు లాగే బండ్లు అవసరమయ్యే అవకాశం ఉన్నచోట పెట్టబడినాయి
  మార్గమధ్యం లో చెడిపోయిన వాహనాలకు సహాయపడుటకు, ప్రత్యేక మెకానిక్ బృందాలు క్లిష్టమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయబడ్డాయి
  నిరంతర రోడ్డు సమీక్షా కోసం బైక్ పార్టీలు నియమించి బడినాయి
  జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ భక్తులకు స్వాగతం తెలుపుతున్నాము.
  మీ యాత్ర సురక్షితంగా, సుఖప్రదంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ క్రింది సూచనలు పాటించి సహకరించగలరు
  మీ భద్రత గురించి జయశంకర్ భూపాలపల్లి పోలీస్ విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది
  పూర్తి జాతర ప్రదేశం కెమెరా నిఘా లో ఉన్నది
  జాతర ప్రదేశములలో మీ విలువైన వస్తువులను జాగ్రతగా ఉంచుకొనగలరు
  వాగులోకి స్నానమునకు వెళ్లునప్పుడు మీ వస్తువులు మీ బంధువుల వద్ద విడిచి వెళ్ళగలరు
  వాగు లో నిర్ణీత లోతునకు మించి పోవరాదు
  వాగు వద్ద అత్యవసర పరిస్థితులలో గజ ఈతగాళ్ళ సహాయం పొందగలరు
  పరిశుభ్రత పాటించి చెత్తను చెత్త డబ్బాలలో మాత్రమే వేయగలరు
  చిన్న పిల్లలను, వృద్ధులను మీతోపాటుగా ఉంచుకొని ఒంటరిగా విడిచి పెట్టకుండా ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండగలరు
  చిన్నపిల్లలు/వృద్ధుల వద్ద జేబులలో మీ వివరాలకు సంబందించిన చిట్టిని పెట్టి ఉంచగలరు
  ఎవరైనా తప్పిపోయినచో సహాయ కేంద్రాలకు త్వరితంగా సమాచారం అందించండి
  తప్పిపోయిన పిల్లలు లేదా వృద్దులు కనపడినచో దగ్గరలోని సేవ సంస్థ సహాయకులకు లేదా సమాచార కేంద్రానికి అప్పగించండి
  దొంగలు ఉంటారు కావున అపప్రమత్తంగా ఉండగలరు
  మీ డబ్బులను, పర్సును వెనుక జేబులో కాకుండా ఇతర సురక్షిత ప్రదేశాలలో ఉంచుకోండి
  ఆర్టీసీ బస్సును ఎక్కుటకు ప్రత్యేక మైన క్యూ లైన్ లు కలవు. గమ్యస్థానాన్ని బట్టి మీ యొక్క క్యూలైన్ చూసుకుని వెళ్ళగలరు
  క్యూలైన్ లో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించగలరు. పోలీస్ వారికి మరియు ఆర్టీసీ సిబ్బందికి సహకరించగలరు
  పార్కింగులలో ఉన్న వాహనాలలో విలువైన వస్తువులు ఉంచకండి
  అపరిచిత వ్యక్తుల నుండి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకండి
  అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, వస్తువులు కనిపించిన యెడల దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించండి
  బహిరంగ మల మూత్ర విసర్జన నిషేదించబడినవి కావున ఏర్పాటు చేయబడిన మరుగుదొడ్లు వాడగలరు
  మీరు వాహనాన్ని నిలిపిన పార్కింగ్ స్థలం పేరు, నిలిపిన ప్రదేశాలను రాసుకొని ఉంచుకొనగలరు. 20 కు పైగా పార్కింగ్ ప్రదేశములు ఉన్నవి కావున పొరబడకుండా ఉండుటకు సహకరించును
  అమ్మ వారి గద్దెలు మరియు ఇతర ప్రదేశాలలో క్యూ లైన్ (వరుసలలో) తోసుకోకుండా, వరుస క్రమంలో క్రమశిక్షణ పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొనగలరు.
  దయచేసి మీ భద్రత మరియు సౌలభ్యం కోసం పని చేస్తున్న పోలీసు మరియు ఇతర సిబ్బందికి సహకరించగలరు
చేయవలసినవి
  భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడిన స్నాన ఘాట్ లను మరియు మరుగుదొడ్లు మాత్రమే వాడండి
  మీరు నివాసం ఉన్న దగ్గరలోని ఘాట్ లు మరుగుదొడ్లు వాడగలరు
  పోలీస్ వారు సూచించిన దారి లోనే వాహనాలు వెళ్లవలెను
  భక్తులు భక్తి శ్రద్దలతో మెలిగి ఇతరులకు ఇబ్బంది కలుగకుండా, సాంప్రదాయ వస్త్రధారణతో జాతర పవిత్రతని కాపాడవలసిందిగా కోరడమైనది
  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి
  చెత్తని చెత్త డబ్బాలలో మాత్రమే వేయగలరు
చేయకూడనివి
  ప్లాస్టిక్ బ్యాగులు నిషేదించబడినవి, కావున వాటిని వాడరాదు
  జంపన్న వాగులో నిర్దేశించిన లోతును మించి వెళ్ళరాదు
  దర్శనం క్యూ లైన్లో తోసుకొనరాదు
  గద్దె పరిసరాలలో ఎటువంటి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడరాదు
  నిషేదించిన/అనుమతి లేని మార్గములలో వెళ్ళరాదు
  ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదు
ఆధారితం -