పోలీస్ మార్గదర్శకాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ భక్తులకు స్వాగతం తెలుపుతున్నాము.
మీ యాత్ర సురక్షితంగా, సుఖప్రదంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ క్రింది సూచనలు పాటించి సహకరించగలరు
మీ భద్రత గురించి జయశంకర్ భూపాలపల్లి పోలీస్ విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది
పూర్తి జాతర ప్రదేశం కెమెరా నిఘా లో ఉన్నది
జాతర ప్రదేశములలో మీ విలువైన వస్తువులను జాగ్రతగా ఉంచుకొనగలరు
వాగులోకి స్నానమునకు వెళ్లునప్పుడు మీ వస్తువులు మీ బంధువుల వద్ద విడిచి వెళ్ళగలరు
వాగు లో నిర్ణీత లోతునకు మించి పోవరాదు
వాగు వద్ద అత్యవసర పరిస్థితులలో గజ ఈతగాళ్ళ సహాయం పొందగలరు
పరిశుభ్రత పాటించి చెత్తను చెత్త డబ్బాలలో మాత్రమే వేయగలరు
చిన్న పిల్లలను, వృద్ధులను మీతోపాటుగా ఉంచుకొని ఒంటరిగా విడిచి పెట్టకుండా ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండగలరు
చిన్నపిల్లలు/వృద్ధుల వద్ద జేబులలో మీ వివరాలకు సంబందించిన చిట్టిని పెట్టి ఉంచగలరు
ఎవరైనా తప్పిపోయినచో సహాయ కేంద్రాలకు త్వరితంగా సమాచారం అందించండి
తప్పిపోయిన పిల్లలు లేదా వృద్దులు కనపడినచో దగ్గరలోని సేవ సంస్థ సహాయకులకు లేదా సమాచార కేంద్రానికి అప్పగించండి
దొంగలు ఉంటారు కావున అపప్రమత్తంగా ఉండగలరు
మీ డబ్బులను, పర్సును వెనుక జేబులో కాకుండా ఇతర సురక్షిత ప్రదేశాలలో ఉంచుకోండి
ఆర్టీసీ బస్సును ఎక్కుటకు ప్రత్యేక మైన క్యూ లైన్ లు కలవు. గమ్యస్థానాన్ని బట్టి మీ యొక్క క్యూలైన్ చూసుకుని వెళ్ళగలరు
క్యూలైన్ లో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించగలరు. పోలీస్ వారికి మరియు ఆర్టీసీ సిబ్బందికి సహకరించగలరు
పార్కింగులలో ఉన్న వాహనాలలో విలువైన వస్తువులు ఉంచకండి
అపరిచిత వ్యక్తుల నుండి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించకండి
అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, వస్తువులు కనిపించిన యెడల దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించండి
బహిరంగ మల మూత్ర విసర్జన నిషేదించబడినవి కావున ఏర్పాటు చేయబడిన మరుగుదొడ్లు వాడగలరు
మీరు వాహనాన్ని నిలిపిన పార్కింగ్ స్థలం పేరు, నిలిపిన ప్రదేశాలను రాసుకొని ఉంచుకొనగలరు. 20 కు పైగా పార్కింగ్ ప్రదేశములు ఉన్నవి కావున పొరబడకుండా ఉండుటకు సహకరించును
అమ్మ వారి గద్దెలు మరియు ఇతర ప్రదేశాలలో క్యూ లైన్ (వరుసలలో) తోసుకోకుండా, వరుస క్రమంలో క్రమశిక్షణ పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొనగలరు.
దయచేసి మీ భద్రత మరియు సౌలభ్యం కోసం పని చేస్తున్న పోలీసు మరియు ఇతర సిబ్బందికి సహకరించగలరు
ఆధారితం -