ఖమ్మం, ఎల్లందు వైపు నుండి
ఎల్లందు నుండి మేడారం ఈ మార్గం ద్వారా సుమారు 111 కిలో మీటర్లు స్వంత వాహనం ద్వారా ఖమ్మం నుండి ఎల్లందు మీదుగా వచ్చువారు క్రింది విషయాలను గమనించవలెను

a) రద్దీ కారణంగా చాలా చోట్ల దారి మార్పులు ఉండును, దయచేసి ఏర్పాటు చేయబడిన సూచికలు మరియు పోలీస్ సిబ్బంది సహకారం పొందగలరు

b) ఎల్లందు నుండి మర్రిగూడెం, రామారం నుండి లింగాల నుండి ఎడమవైపుకు తీసుకొని పసర చేరవచ్చు. పసర నుండి నేరుగా మేడారం రోడ్డులో ప్రాజెక్ట్ నగర్, వెంగళాపూర్, నార్లాపూర్ మీదుగా అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్రదేశానికి చేరుకుంటారు

c) రద్దీని బట్టి ప్రాజెక్టు నగర్ నుండి ఊరట్టం వరకు కాళీ ని బట్టి, అందుబాటులో ఉన్న పార్కింగ్ వరకు వాహనాలు అనుమతించబడుతాయి

d) పార్కింగ్ దొరికిన ప్రదేశంలో మీ వాహనాన్ని నిలిపి అక్కడినుండి అందుబాటులో ఉన్న బస్సు లేదా వాహనాల ద్వారా జాతర ప్రదేశం చేరుకోవచ్చు

e) దయచేసి మీరు వాహనం నిలిపిన పార్కింగ్ ప్రదేశం పేరు, నిలిపిన ప్రదేశాన్ని గుర్తుంచుకొని లేదా రాసుకొని ఉంచుకొనగలరు. మొత్తం 30 పైన పార్కింగ్ ప్రదేశములు ఉన్నవి కావున, తిరిగి వచ్చునప్పుడు ఇబ్బంది లేకుండా మీ వాహనం కనుగొనడం వీలవుతుంది.

f) మేడారంనకు వచ్చు మరియు తిరిగి వేళ్ళు దారులు వేరని గమనించ గలరు. వివరాలకు "మేడారం నుండి వెళ్ళుట" శీర్షిక చూడగలరు

g) ఈ మార్గంలో వచ్చే పార్కింగ్ ప్రదేశాల కోసం "పార్కింగ్" శీర్షిక చూడగలరు

ఆధారితం -